హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీసుల ప్రాణాలకు విలువ లేదా?: రంజిత్ రెడ్డి

HNK: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూపాలపల్లి ఏఆర్ కానిస్టేబుల్ దిలీప్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు దుగ్గింపూడి రంజిత్ రెడ్డి శనివారం పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. పోలీసుల వైద్య సాయాన్ని రూ.15లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దిలీప్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.