హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రీ దేవిగా శ్రీ జమ్ములమ్మ అమ్మవారు

GDWL: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజైన శనివారం గద్వాల సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి కృష్ణా నది పవిత్ర జలాలతో విశేష స్నపనాభిషేకం, శాస్త్రోక్తంగా ఆకుపూజ నిర్వహించారు. వేదమాతగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.