హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల పరిషత్ కార్యాలయంలో కొండెంగ హల్‌చల్

ASF: సొనాల పరిషత్ కార్యాలయంలో కొండెంగ హల్‌చల్ చేసింది. వీబీజీ రాంజీ పథకం సిబ్బంది గదిలోకి ప్రవేశించి, టేబుల్‌పై కూర్చొని రిజిస్టర్‌ను తిరగేసింది. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కార్యాలయం అంతా తిరిగిన కొండెంగ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతకుముందు గ్రామ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేయడంతో అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.