MHBD: బయ్యారం మండలంలో శుక్రవారం మోస్తరు వర్షం కురవడంతో రైతులు కొంత వరకు ఊపిరి పీల్చుకున్నారు. ఎండిపోతున్న పంటలకు ప్రాణం వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాన పడింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక బావులు అడుగంటిన వేళలో ఈ వర్షం తమకు ఊరటనిచ్చిందని మండలంలోని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జిల్లాలో కురిసిన వర్షం


