హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగపేటలో పోలీసుల కార్డాన్‌ అండ్ సెర్చ్‌

MNCL: మంచిర్యాల పట్టణంలోని రంగపేటలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ధ్రువపత్రాలు లేని 40 బైక్ లను సీజ్‌ చేశారు. సీఐ ప్రమోద్‌ రావు గ్రామస్థులు, యువతకు గంజాయి, మత్తు పదార్థాలు, జూదం, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరుతూ వాలీబాల్‌, నెట్‌ను అందజేశారు.