MDCL: కుత్బుల్లాపూర్లో నకిలీ ULC పత్రాలతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిషేధిత లే అవుట్లోని ఫ్టాట్ల విక్రయానికి నకిలీ నిరభ్యంతర పత్రాలు సృష్టించి, రూ.6 లక్షలు వసూలు చేసిన ముగ్గురిని సూరారం పోలీసులు అరెస్ట్ చేశారు. పత్రాలను పరిశీలించిన సబ్రిజిస్టార్కు అవి నకిలీవని తేలడంతో ఈ మోసం బయటపడింది. నిందితులను రిమాండ్కు తరలించారు.
తెలంగాణ
నకిలీ ULC పత్రాలతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్!


