JN: దేవరుప్పుల మండలం సింగరాయగండి సమీపంలో రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తోటకూరి హనుమంతు (58) మృతి చెందారు. ప్రమాదవశాత్తు వరికోత యంత్రం ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు డ్రైవర్ మధుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
హార్వెస్టర్ కింద పడి వ్యక్తి మృతి


