SRPT: మునగాల మండలంలోని కలకోవ గ్రామాన్ని సీఐ ప్రతాప్ శుక్రవారం సాయంత్రం సందర్శించి గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడాలని, బతుకమ్మ వేడుకలను ఎలాంటి గొడవలకు తావులేకుండా సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని తెలిపారు.
తెలంగాణ
'శాంతియుతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి'


