హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్

ASF: కాగజ్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ బి. హరిత శుక్రవారం రాత్రి సందర్శించి, శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు కమలాకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిలువేరు గంగాధర్, సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.