NZB: సిరికొండ (M)లోని చీమన్పల్లిలో శుక్రవారం 1982–1985 మధ్య పనిచేసిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఎడ్లబండిపై ఊరేగించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరసయ్య మాట్లాడుతూ.. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, గురువులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందంగా గడిపారు.
తెలంగాణ
VIDEO: ఎడ్లబండిపై గురువుల ఊరేగింపు..!


