ASF: బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పశువుల సంచారంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై పశువులు అడ్డంగా తిరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పశువుల సంచారం..రాకపోకలకు అంతరాయం


