హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్లకు ధృవపత్రాల చిక్కులు

WGL: చేయూత పింఛన్ల మంజూరు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న 360 డిగ్రీల వెరిఫికేషన్ విధానం దరఖాస్తుదారులకు సవాలుగా మారింది. ధృవపత్రాల సమర్పణలో లబ్ధిదారులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లబెల్లి డివిజన్‌లో 15,269 దరఖాస్తులు రాగా, నల్లబెల్లి మండలంలో 727 దరఖాస్తులు వచ్చాయి. కొత్త నిబంధనలతో పింఛన్ల మంజూరు ఆదేశం ఆలస్యం అవుతుందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.