మంచిర్యాల జిల్లా కలెక్టరెట్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఉద్యోగులతో కలిసి హాజరై కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ప్రకృతిలో సహజంగా లభించే పూలను సేకరించి, బతుకమ్మగా పేర్చి, దేవతా స్వరూపంగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం తెలంగాణలో ప్రత్యేకంగా కొనసాగుతోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి పట్ల గౌరవభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
తెలంగాణ
ప్రకృతి పట్ల గౌరవభావానికి ప్రతీక బతుకమ్మ


