హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం కావాలి: కలెక్టర్

ADB: రానున్న యాసంగిలో ఎల్‌నినో ప్రభావంతో తలెట్టే కరువును ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం అధికారులతో సమావేశమై కలెక్టర్ మాట్లాడారు. నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వేసవిలో తాగునీరు, పశువుల నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.