హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకం

MNCL: ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకమని, 2వ దశ జన గణన కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమీక్షించారు. జనగణన కార్యకలాపాలను డిజిటల్ విధానంలో సమర్థంగా నిర్వహించడం, కచ్చితమైన సమాచారాన్ని సేకరించడం ద్వారా సంక్షేమ పథకాల రూపకల్పనకు అవసరమైన గణాంకాలు సిద్ధం చేయాలన్నారు.