హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 32 అడుగుల బతుకమ్మ ఏర్పాట్లు

SRD: మహబూబ్ సాగర్ చెరువు వద్ద బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. చెరువు కట్టపై 16 టన్నుల స్టీల్, 8 టన్నుల రంగురంగుల పూలతో 32 అడుగుల భారీ బతుకమ్మను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.