సిద్దిపేట జిల్లా గౌరారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గజ్వేల్కు చెందిన గుండ్ల నరేష్(38) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య నవనీత గాయపడ్డారు. కంపెనీ డ్యూటీ ముగించుకుని దంపతులిద్దరూ వెళ్తుండగా వేగంగా వచ్చిన క్రేన్ వీరిని ఢీకొట్టింది. కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య కన్నీరుమున్నీరైంది. ఘటనపై ఎస్సై జె. ఆరోగ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
గౌరారంలో ఘోర రోడ్డు ప్రమాదం


