హైదరాబాద్: 28°C
వార్తలు

వచ్చే నెల 3న NWDA సమావేశం

TG: జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(NWDA) సాధారణ సర్వసభ్య సమావేశం వచ్చే నెల 3న ఢిల్లీలో జరగనుంది. ఎజెండాలో భాగంగా గోదావరి-కావేరీ నదుల అనుసంధాన DPRపై ఇందులో చర్చించనున్నారు. ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్‌ నుంచి నీటిని తరలించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. సభ్య రాష్ట్రాలు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో హాజరుకావాలని డైరెక్టర్ జనరల్ బాలేశ్వర్ ఠాకూర్ కోరారు.