హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అంగన్వాడీ పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

MDK: చిన్నారులు, గర్భిణులు, బాలింతల సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం ఎంతో ప్రధానమైనదని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే పోషకాహారాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. శుభ్రత పాటిస్తూ.. పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.