హైదరాబాద్: 28°C
తెలంగాణ

అశోక్ హత్య కేసులో మూడో నిందితుడు అరెస్ట్

BHPL: జడల అశోక్ హత్య కేసులో పరారీలో ఉన్న మూడో నిందితుడు తలారి రాజేందరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దుబ్బలపాడు గ్రామ శివారులోని ప్రధాన రహదారి వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా పట్టుకుని విచారించామని, మరో ఇద్దరితో కలిసి నేరంలో పాల్గొన్నట్లు అంగీకరించాడని పేర్కొన్నారు.