హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ కబడ్డీ శిక్షణ శిబిరానికి సురేశ్, అబ్రార్ ఎంపిక

NZB: నిజామాబాద్ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు సురేశ్, అబ్రార్ జాతీయ స్థాయి అండర్‌-20 బాలుర కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో వీరు పాల్గొననున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. లింగయ్య, కార్యదర్శి కే. గంగారెడ్డి తెలిపారు.