హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతులకు పరిహారం ఇవ్వాలి'

RR: మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ చెప్పినట్టే రైతులు మోసపోయి ఘోష పడుతున్నారని, వ్యవసాయానికి విద్యుత్ అందించడంలో సర్కారు విఫలమైందన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ. 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.