హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ మార్పే మా లక్ష్యం: కాంగ్రెస్

రెజిమ్ ఛేంజ్ అనేది ప్రతిపక్షాల ఉద్దేశమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకోవడంలో తప్పేమి లేదని ఆ పార్టీ నేత పవన్ ఖేరా తెలిపారు. ఓట్ చోర్, గద్దీ ఛోడ్ పేరుతో తాము ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించి పాలనను మార్చాలనే ఉద్దేశాన్ని బహిరంగానే చెబుతున్నామని పేర్కొన్నారు.