హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర హోంమంత్రిని కలిసిన ఎంపీ

AKP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఎంపీ సీఎం రమేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు, ప్రత్యేకంగా అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రాధాన్యతలను ఆయనకు వివరించారు. అనంతరం పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అమిత్ షా పలు సూచనలు చేశారు.