హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులు ఉద్యమిస్తున్నారు: ప్రకాశ్ రాజ్

ప్రస్తుతం దేశంలో విద్యార్థులు ఉద్యమించడం మొదలుపెట్టారని నటుడు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. వారి నిరసనలకు రైతులు, పౌర సమాజం గొంతు కల్పిందని చెప్పారు. ఈ పరిస్థితి చూస్తుంటే దేశంలోని ప్రతీ ప్రాంతం, నగరం, ఓ జంతర్ మంతర్‌లా మారిపోతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా మళ్లీ పౌర హక్కుల పోరాటాలు, ప్రజా నిరసనలు ఊపందుకుంటున్నాయనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే నిదర్శనమన్నారు.