హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజకీయ పార్టీలతో కలెక్టర్‌ సమావేశం

ASR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌ టి. నిశాంతి శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్‌, ప్రవర్తనా నియమావళి, ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పాల్గొన్నారు.