హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో వివాహిత దారుణ హత్య

KDP: బద్వేల్ సుమిత్ర నగర్‌లో ప్రవళిక (28)ను సాయిబాబా కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వీరిద్దరూ వివాహం చేసుకోగా, మనస్పర్థలే హత్యకు కారణంగా తెలుస్తోంది. మేనత్త ఇంట్లో ఉన్న ప్రవళికపై దాడి చేసి సాయిబాబా పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది.