హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో వైసీపీలోకి బీజేపీ కార్యకర్తలు

KRNL: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఆదోని నియోజకవర్గంలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. కల్లుపోతుల సురేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీకి చెందిన పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎన్నికల వేళ ఈ చేరికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.