హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘంటసాల మండలంలో ఎన్నికల కోడ్ అమలు

KRISHNA: ఘంటసాల మండలంలో ఎన్నికల కోడ్ అమలు పురస్కరించుకొని అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ప్రధాన కూడలిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలకు గ్రామ పంచాయతీ సిబ్బంది ముసుగులు ఏర్పాటు చేశారు. వారి ప్రాముఖ్యత వివరించే శిలాఫలకాలపై కాగితాలు అంటించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ళు, రహదారులకు ఇరువైపులా విద్యుత్ స్థంభాలకు ఉన్న ఫ్లెక్సీ బోర్డులు తొలగించారు.