హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్ని ప్రమాద బాధితులకు అండగా కళింగాంధ్ర

SKLM: టెక్కలి మండలం రావివలస గ్రామంలో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబానికి కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ అండగా నిలిచింది. రూ.4 లక్షల ఆస్తి నష్టంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయంతో పాటు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, దుస్తులు గురువారం అందజేసింది. అధ్యక్షుడు పైడి నవీన్, తదితరులు ఉన్నారు.