అన్నమయ్య: చిట్వేలు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దొగ్గలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హిటాచీకి అనుసంధానంగా ఉన్న లారీ అతనిపై దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లారీ మార్గోపల్లికి చెందినదిగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


