హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో బావిలో పడ్డ వ్యక్తి

KNR: హుజూరాబాద్‌లోని వరంగల్ రోడ్డులో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం తాగిన వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. బావిలో నీళ్లు తక్కువగా ఉండటంతో గాయాలతో బయటపడ్డాడు. బావిలో నుంచి కాపాడాలంటూ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు.