మంచిర్యాల జిల్లాలో నియోనేటల్ 108, 102 అంబులెన్సులను ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్, జిల్లా మేనేజర్ కొండల్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్సుల్లోని వైద్య పరికరాలు, ఆక్సిజన్ సదుపాయాలు, వాహనాల కండిషన్, రికార్డులను పరిశీలించారు. అత్యవసర సేవలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
108, 102 అంబులెన్సుల తనిఖీ


