హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారిపై క్షుద్రపూజల కలకలం

BHPL: కాటారం నుంచి మహాదేవపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవారం క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో కలకలం రేగింది. నస్తూరుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పండుగకు ముందు ఈ ఆనవాళ్లు కనిపించడంతో అటుగా వెళ్లే వాహనదారులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన పరిసర గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.