హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిరంగిపురంలో రాజకీయ ఫ్లెక్సీలు, జెండాల తొలగింపు

GNTR: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫిరంగిపురంలో పంచాయతీ కార్యాలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు, జెండాలను తొలగించారు. అలాగే విగ్రహాలకు ముసుగులు వేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలు కనిపించకుండా వాటిపై కాగితాలు అంటించారు.