హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అడపవలసలో డ్రైనేజీ కాలువలు నిర్మించాలి'

ASR: డుంబ్రిగుడ మండలం అడపవలస గ్రామంలో సీసీ రోడ్డు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు వెంటనే నిర్మించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, స్థానికులు ఇవాళ డిమాండ్ చేశారు. కాలువలు లేక రోడ్డు మధ్యలోకి నీరు చేరడంతో సీసీ రోడ్డు దెబ్బతిని శిథిలావస్థకు చేరుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరారు.