MDK: నర్సాపూర్ పట్టణంలోని ఓ రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన 18 మంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి


