హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రచార రథాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచార రథాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.