హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మళ్లీ పోలీసుల ఆంక్షలు

ఢిల్లీలో మళ్లీ పోలీసుల ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. CJP తిరంగా యాత్ర పిలుపుతో ప్రజలు నిరసనలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ జెండా ఎగురవేసేందుకు 11 మందికి అవకాశం ఇస్తామన్నారు. ఇవాళ, రేపు సెంట్రల్ పార్కును మూసివేయనున్నారు. మ.3 గంటల నుంచి ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.