హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

PDPL: ధర్మారం (M) కొత్తూరు గ్రామంలో నెరువట్ల స్వామికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.60,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ సర్పంచ్ భూక్య సంగీత శుక్రవారం లబ్ధిదారుడికి అందజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ చెక్కును అందించినట్లు సర్పంచ్ సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సామల నాగభూషణం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.