హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చదువుల తల్లిగా ఆరాధించబడే ఆ దేవి అనుగ్రహం ఉండాలి'

HYD: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ సరస్వతి రూపంలో అలంకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్యా లాభం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారన్నారు. చదువుల తల్లిగా ఆరాధించబడే సరస్వతి దేవి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.