హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌కు చెందిన 319 మందికి పౌరసత్వం

పాకిస్తాన్ నుంచి వలసొచ్చి గుజరాత్‌లో తలదాచుకున్న 319 మందికి భారత పౌరసత్వం లభించింది. నిరీక్షణ ఫలించడంతో ఆ కుటుంబాలన్నీ తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. రాజ్‌కోట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర Dy. CM హర్ష్ సంఘ్వీ లబ్ధిదారులకు పౌరసత్వ పత్రాలను అందజేశారు. 'నవ్వుకోండి, ఇకపై మీరందరూ అధికారికంగా భారతీయులే' అంటూ Dy. CM వారికి అభినందనలు తెలిపారు.