హైదరాబాద్: 28°C
తెలంగాణ

భగత్‌సింగ్ నగర్ ఘర్షణ.. ఇద్దరు అరెస్ట్

ADB: ఆదిలాబాద్‌ భగత్‌సింగ్ నగర్‌లో పాత కక్షలతో ఘర్షణ జరిగినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. సీసీటీవీ దృశ్యాల్లో తొలుత స్వామి మాలధారణలో ఉన్న వ్యక్తి దాడికి పాల్పడినట్లు నమోదైందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో మతసామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.