హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవి దళితులకు కేటాయించాలని ధర్నా

కాకినాడ: సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పదవిని దళితులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ దళిత నాయకులు నిరసన చేపట్టారు. సామర్లకోట పెద్దాపురం రోడ్డు పోస్టాఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ డిమాండ్‌ను వినిపించారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దళితులకు ఛైర్మన్ అభ్యర్థిత్వం కేటాయించాలన్నారు.