హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరెన్సీ నోట్లతో బల్కంపేట ఎల్లమ్మ దివ్యదర్శనం

HYD: బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు గర్భగుడిని కరెన్సీ నోట్లతో సర్వాంగసుందరంగా అలంకరించారు. మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే పవిత్ర గంగాజలాలు, పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.