హైదరాబాద్: 28°C
తెలంగాణ

తగ్గిన నీటి మట్టం.. బయటపడిన సంగమేశ్వర విగ్రహాలు!

నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల సంగమేశ్వర క్షేత్రంలో కృష్ణానది నీటి మట్టం వేగంగా తగ్గడంతో ఆలయం వెనక భాగంతో పాటు, దేవుళ్ల విగ్రహాలు జలాధివాసం వీడి బయటపడ్డాయి. దసరా పండుగ నాటికి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పురోహితుడు తెల్కపల్లి రఘురామశర్మ తెలిపారు.