హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల వేల అందరూ సహకరించాలి'

ప్రకాశం: ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు ప్రజలకు మున్సిపల్ కమిషనర్ రమణబాబు శుక్రవారం పలు సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎన్నికల నియమాలను పాటిస్తూ, అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలన్నారు.