హైదరాబాద్: 28°C
తెలంగాణ

బావిలో పడి వృద్ధురాలు మృతి

WGL: వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు గుండ్రపల్లి చెరువు కట్ట సమీపంలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.