హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీమకుర్తిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

ప్రకాశం: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ హర్షవర్ధన్ శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, పోలీసుల విధులపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.