హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రుద్రాక్ష శివ హనుమాన్ దేవాలయంలో శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.